థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిదాంబి శ్రీకాంత్...
కిదాంబి శ్రీకాంత్ కూడా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కాలి పిక్క కండరాలు పట్టేయడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు శ్రీకాంత్ ప్రకటించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో మలేషియాకు చెందిన లీ జి జియాతో శ్రీకాంత్ తలపడాల్సి ఉంది. కానీ కిదాంబి తప్పుకోవడంతో లీ జి టోర్నీలో ముందంజ వేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)