ఎన్‌టీఆర్ సరసన కియారా ఎంతవరకూ నిజం..

ఎన్‌టీఆర్ సరసన కియారా ఎంతవరకూ నిజం..

యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే దీని తరువాత ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా తెరకెక్కుందుకు సిద్దంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే మొదలు చేయనున్నారు. దీనికి కళ్యాణ్ రామ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించనున్నారు. అరవింద సమేతా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం అయ్యేసరికి ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మరి ఇందులో తారక్‌తో రొమాన్స్ ఎవరు చేయనున్నారని సందేహాలు వచ్చాయి. దాంతో ఎందరో పేర్లు వినిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ భామ కియారా అద్వానీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది. ఆ ఒక్కసినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. వెంటనే వినయ విదేయ రామ సినిమాలో చేసింది. ఈ సినిమా డిసాస్టర్‌గా మిగలడంతో తెలుగులో మరో సినిమా చేయలేరు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్, త్రవిక్రమ్ కాంబోలో నటించేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఇదెంత వరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.