ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కియా : మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధం... 

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కియా : మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధం... 

సౌత్ కొరియాకు చెందిన కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో తన ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఈ ప్లాంట్ నుంచి కార్ల ఉత్పత్తి ఇప్పటికే మొదలైంది. కియా మోటార్స్ నుంచి వచ్చిన కార్లు చౌకగా ఉండటంతో పాటుగా నాణ్యత విషయంలోనూ, వినియోగదారునికి నచ్చే విధంగా తయారు చేయడంతో కియా కారుకు డిమాండ్ పెరిగింది.  

లాక్ డౌన్ సమయంలోనూ ఆన్లైన్ లో కియా కారు బుకింగ్ లు జోరుగా సాగాయి.  దీంతో ఈ కారు ఇండియాలో సక్సెస్ అయ్యింది.  దీంతో కియా ఎస్.యూ.వీ కార్ల తయారీ కోసం మరో రూ.54 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది.  ఈ పెట్టుబడితో దేశీయంగానే కియా ఎస్.యూ.వీ కార్లను తయారు చేయబోతున్నట్టు కియా మోటార్స్ ప్రకటించింది. ఎస్.యూ.వీ యూనిట్ ను కూడా ఏపీలో ఏర్పాటు చేస్తే మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది.