కియాలో కరోనా కలకలం... ఆందోళనలో ఉద్యోగులు... 

కియాలో కరోనా కలకలం... ఆందోళనలో ఉద్యోగులు... 

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేసింది.  మార్చి 25 వ తేదీ ముందు వరకు ప్లాంట్ పనిచేసింది.  అప్పటికే ఆ సంస్థ నుంచి వందలాది కార్లు రిలీజ్ కావడం మార్కెట్లో సక్సెస్ కావడం జరిగిపోయింది.  లాక్ డౌన్ సమయంలో కేంద్రం కంపెనీలకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. దీంతో కియా కంపెనీ మరికొంత పెట్టుబడిని ఈ కంపెనీలో పెట్టి అనంతపురం ప్లాంట్ నుంచే ఎస్.యూవీ వాహనాలను తయారు చేయాలని నిర్ణయించింది.  

లాక్ డౌన్ 4 లో సడలింపులు ఇవ్వడంతో అనంతపురం కియా ప్లాంట్ తిరిగి ప్రారంభం అయ్యింది.  మే 25 వ తేదీ నుంచి ఉద్యోగులు ప్లాంట్ లో పని చేస్తున్నారు.  కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిరోజూ థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్, మాస్క్, పీపీఈలు  అందిస్తున్నారు.  అయితే, కియా ఫ్యాక్టరీలో బాడీ షాప్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.  దీంతో కంపెనీ అలర్ట్ అయ్యింది.  కరోనా పాజిటివ్ వచ్చిన ఉగ్యోగిని హోమ్ క్వారంటైన్ కు పంపించారు.  ఆ ఉద్యోగితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారిని ట్రేస్ చేసే పనిలో ఉన్నది కంపెనీ.  కంపెనీలో పనిచేస్తున్న అందరికి కరోనా టెస్టులు నిర్వహించేందుకు కియా యాజమాన్యం సిద్ధం అయ్యింది.