రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెబుతున్నా : ఖుష్బూ

రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెబుతున్నా : ఖుష్బూ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. నూతన జాతీయ విద్యా విధానం 2020కి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ విద్యావిధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా స్వాగతించారు.దాంతో  ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి .ఇదిలా ఉంటే నూతన విద్యావిధానాన్ని స్వాగతించినందుకు రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెబుతున్నానని ఖుష్బూ పేర్కొన్నారు. ప్రతిదానికి అధిష్ఠానం చెప్పినట్లు తలాడించడానికి తాను రోబోను కాదని, అందుకే నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించానని ఖుష్బూ తెలిపారు. ప్రతీది నాయకుడి అంగీకారంతో మాట్లాడటం కాదని, పౌరులుగా మన వ్యక్తిగత అభిప్రాయాలను ధైర్యంగా చెప్పగలుగాలని పేర్కొన్నారు.