తరువాతి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్

తరువాతి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్

ప్రశాంత్ నీల్ ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దక్షిణాది నుంచి వచ్చి పాన్ ఇండియా స్తాయిలో పేరు తెచ్చుకున్న సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఉంటుంది.  హీరోను చూపించడంలో అతడికి ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ కేజీఎఫ్2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ స్టార్ దర్శకుడు తన తరువాతి సనిమా ఎవరితో చేయనున్నాడని, టాలీవుడ్ హీరోలు కూడా అతడితో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్రటికే ప్రశాంత్ మైత్రి మేకర్స్‌తో ఓ ఒప్పందం చేసుకున్నాడు. అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో ప్రశాంత్ ఓ సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తారక్ ఇప్పటికే ఓ మంచి సినిమా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌టీఆర్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రశాంత్‌తో సినిమా చేస్తాడనీ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వాటిని నిజం చేస్తూ ఓ మూవీ క్రిటిక్ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ తన తరువాతి సినిమాను టాలీవుడ్ హీరోలు ప్రభాస్ లేదా ఎన్‌టీఆర్‌తో చేసే వార్త వాస్తం అంటూ ఆట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుందని అన్నారు. మరి వీరిలో ఎవరితో సినిమా చేయనున్నాడనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఎవరు ఓకే చెప్పనున్నారనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.