డేటా వార్ కేసు కీలక మలుపు..

డేటా వార్ కేసు కీలక మలుపు..

ఏపీ, తెలంగాణ మధ్య డేటా వార్ రోజురోజుకూ మరింత ముదురుతుంది. ఇప్పటికే ఈ కేసు విచారణకు తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటు చేయగా... మరోవైపు తెలంగాణ పోలీసులపై గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్. కాగా, ఈ కేసులో నేడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంచార్జ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు అధికారులు. ఈ సమావేశంలో 9 మంది అధికారులు పాల్గొననున్నారు. కేసుకు సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఇవాళ సైబరాబాద్ పోలీసులు సిట్‌కు అప్పగించనున్నారు. అలాగే పోలీసులు నోటీసులుకి అమెజాన్, గూగుల్ సంస్థలు వివరణ ఇవ్వనున్నాయి. మరోవైపు ఈ కేసులో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఎండీ అశోక్ కోసం ఇంకా ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సిట్ ఆధ్వర్యంలో ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీ పౌరుల డేటా ను ఐటీ గ్రిడ్స్‌కి అందించడంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై కూడా విచారణ చేపట్టనుంది సిట్.