రాహుల్ ద్రవిడ్ వల్లే నా ఆట తీరు మెరుగైంది : పీటర్సన్

రాహుల్ ద్రవిడ్ వల్లే నా ఆట తీరు మెరుగైంది : పీటర్సన్

శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ విలువైన సూచనలు చేశాడు. తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్‌ చేసిన సాయంతో తన ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. స్పిన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ రెండు ట్వీట్లు చేశాడు. అందులో రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పంపిన ఈమెయిల్‌ను చదవాలని సూచించాడు. అది తన ఆటను పూర్తిగా మార్చేసిందన్నాడు. అయితే ఇంతకముందు భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పై మాట్లాడుతూ... ఆసీస్ పర్యటన కాదు వచ్చే నెలలో హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ భారత జట్టుకు అతి పెద్ద సవాల్.. కాబట్టి ఆతిథ్య జట్టు జాగ్రత్తగా ఉండాలని తెలిపిన పీటర్సన్.. ఆసీస్ పై విజయానికి ఎక్కువగా సంబరాలు జరుపుకోకండి... ఇంగ్లాండ్ తో టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య వచ్చే నెల 5న మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.