కోహ్లీ ఇది టెస్ట్ కాదు టీ 20...  

కోహ్లీ ఇది టెస్ట్ కాదు టీ 20...  

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా ప్రభావం తగ్గకపోయేసరికి ఈ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లతో పాటు ఆర్సీబీ కూడా అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత దుబాయ్ లో తమ ఆరు రోజుల క్వారంటైన్ ను ముగించుకొని ప్రస్తుతం శిక్షణను కొనసాగిస్తుంది. ఇక కరోనా విరామం కారణంగా దాదాపు 5 నెలల తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన కోహ్లీ తన ప్రాక్టీస్ లో ఎక్కువగా బంతులను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజగా తన సోషల్ మీడియాలో వికెట్లపైకి వస్తున్న బంతిని డిఫెన్స్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసాడు కోహ్లీ. దానికి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ '' కోహ్లీ ఇది టెస్ట్ కాదు టీ 20... బంతిని హిట్ చేయ్'' అని కామెంట్ జత చేశాడు. మరి చూడాలి పీటర్సన్ కు కోహ్లీ తన తర్వాత పోస్ట్ తో సమాధానం ఇస్తాడా అనేది. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకొని జట్లలో ఆర్సీబీ కూడా ఉంది.