ఎన్టీఆర్ కు జోడీగా 'రొమాంటిక్' బ్యూటీ.?

ఎన్టీఆర్ కు జోడీగా 'రొమాంటిక్' బ్యూటీ.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్  సినిమాలో చేస్తున్న విషయం తెల్సిందే. గిరిజన వీరుడు కొమరం భీమ్ గా  గర్జించడానికి సిద్దమవుతున్నాడు తారక్ . ఇప్పటికే విడుదలైన తారక్ టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తారక్ కోసం ఇప్పటికే గురిజీ అదిరిపోయే స్క్ర్పిట్ ను రెడీ చేసాడట.  ఈ సినిమాపాలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఆమధ్య పుకార్లు వినిపించాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పైన కూడా చాలా వార్తలు వచ్చాయి. పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా పూరిజగన్నాథ్ హీరోయిన్ పేరుకూడా వినిపిస్తుంది. పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ తెలుగులో పరిచయం అవుతుంది. త్రివిక్రమ్ ఈ అమ్మడిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అని ఎన్టీఆర్ అభిమానులంతా చర్చించుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో గురూజీ జడ్జ్ మెంట్ ఇప్పటి వరకు తప్పలేదు. ప్రముఖ ఓటీటీ కోసం కేతికశర్మ అల్లు అర్జున్ తో కలిసి ఓ యాడ్ లో నటించింది. ఈ యాడ్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో ఈ అమ్మడు అయితేనే సూటవుతుందని త్రివిక్రమ్ కేతికాని కన్ఫామ్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబం తో కలిసి దుబాయ్ వెళ్లరు.  కంటిన్యూ గా ఆర్ఆర్ఆర్  షూటింగ్ లో పాల్గొంటున్న తారక్ భార్య పిల్లలతో దుబాయ్ వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి .