కేరళకు కొత్త టెన్షన్.. మళ్లీ భారీగా కోవిడ్ కేసులు

కేరళకు కొత్త టెన్షన్.. మళ్లీ భారీగా కోవిడ్ కేసులు

ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కేరళను కోవిడ్ కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 2,791 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. 16 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 3,517 మంది కరోనానుంచి కోలుకున్నట్టు తెలిపారు సీఎం.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 42,819 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 4,287 మంది మృతిచెందారు. రికవరీ కేసుల సంఖ్య 10,27,826కు పెరిగింది. అయితే, టెస్టులను కూడా పెంచింది సర్కార్.. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తం అవుతున్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,764 సాంపిల్స్ పరీక్షించినట్టు సీఎం ప్రకటించారు.