కేరళ అసెంబ్లీ ఎన్నికలకు.. మళ్లీ తెరపైకి గోల్డ్ స్కామ్..!
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్డీఎఫ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి స్వప్న సురేష్ సంచలన విషయాలు వెల్లడించారు. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలకంగా వ్యవహరించచారని, కాన్సులేట్ జనరల్‌తో ఆయన నేరుగా సంప్రదింపులు జరిపారని స్వప్నా సురేష్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎదుట స్పష్టంచేశారు.
సీఎం విజయన్, స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్తో పాటు ముగ్గురు కేబినెట్ మంత్రులకు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం ఉందని కస్టమ్స్ శాఖ కేరళ హైకోర్టుకు నివేదించింది. సీఎం పినరయి విజయన్‌కు అరబిక్ మాట్లాడటం, అర్ధం చేసుకోవడం రాదని.. ఈక్రమంలోనే కాన్సులేట్ జనరల్, ముఖ్యమంత్రి మధ్య సాగిన సంప్రదింపులకు స్వప్నా సురేష్ మీడియేటర్‌గా వ్యవహరించేవారని, ఈ ఒప్పందంలో ముఖ్యమంత్రి, మంత్రులు కోట్లలో కమీషన్ పొందారని స్వప్నా సురేష్ స్టేట్మెంట్ వెల్లడించిందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. మొత్తానికి... కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ గోల్డ్ స్కామ్ మరోసారి బయటకు రావటం సంచలనంగా మారగా.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.. క్లీన్ ఇమేజ్ ఉన్న విజయ్‌పై బురదజల్లే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)