కేరళ ఎన్నికలు: చరిత్ర సృష్టిస్తారా... పునరావృతమౌతుందా? 

కేరళ ఎన్నికలు: చరిత్ర సృష్టిస్తారా... పునరావృతమౌతుందా? 

కేరళలో 140 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  ఈ ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  కేరళలో సీపీఐ నేతృత్వంలోని ఎల్డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి.  అయితే, ఈసారి బీజేపీకూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నది.  ప్రస్తుతం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్నది.  తమిళనాడు మాదిరిగానే కేరళ ఓటర్లు కూడా ఒకేసారి ఒకరికి మరొకసారి మరొకరికి అవకాశం ఇస్తుంటారు.  అయితే, ఈసారి అధికారం తమ సొంతం అవుతుందని ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు.  సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో విజయన్ తెలిపిన సంగతి తెలిసిందే.  అయితే, గత ఐదేళ్లలో ఎల్డిఎఫ్ కూటమి సాధించిన అభివృద్ధి శూన్యం అని, ఈసారి ఓటర్లు తమ సంప్రదాయాన్ని కొనసాగించి యూడీఎఫ్ కు పట్టంకడతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.  అయితే, బీజేపీ కూడా విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.  మెట్రోమెన్ శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించింది.  దీంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.  ఓటర్లు ఎప్పటిలాగే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదంటే ఎల్డిఎఫ్ కు అధికారం కట్టబెట్టి చరిత్ర సృష్టిస్తారా చూడాలి.