మహానటికి చేతినిండా సినిమాలే..

మహానటికి చేతినిండా సినిమాలే..

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. దాంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా  ఓటీటీ  వేదికగా విడుదలవుతున్నాయి . ఇదిలా ఉంటే  'మహానటి' చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది నటి కీర్తిసురేష్. అయితే ఆ సినిమా తర్వాత కీర్తిసురేష్ ఎక్కువగా లేడీ ఒరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది.

తాజాగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రీసెంట్‌గా 'సర్కారు వారి పాట' చిత్రంలో ఆమె సెలక్ట్ అయ్యే వరకు.. ఆమె హీరోల చిత్రాలలో ఇకపై చేస్తుందా లేదా? అనే డౌట్ వచ్చింది. ఈ సినిమాకి ముందే ఆమె 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' వంటివి ఆమె చేసిన, చేస్తున్న చిత్రాలు. ఇవన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఒకే చేసింది  ఇక  వీటితో పాటు నితిన్ 'రంగ్ దే' సినిమాలో కూడా నటిస్తుంది. నితిన్ మరో సినిమాలో కూడా కీర్తినే  హీరోయిన్ గా అనుకుంటున్నారు. కీర్తి సినిమాల్లో పెంగ్విన్ ఇటీవల .ఓటీటీ విడుదలైంది . ఇక 'మిస్ ఇండియా' కూడా  ఓటీటీ  విడుదలకు  సిద్ధంగా ఉంది .