'సర్కారు వారి పాట' హీరోయిన్ ఫిక్స్

'సర్కారు వారి పాట' హీరోయిన్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇక మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నాడని తెలుస్తుంది. అంతే కాక ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ రావాలని బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారట.ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత కీర్తి ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటున్నారని వార్తలు షికారు చేసాయి.  తాజాగా ఏ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని నిర్మాతలు కన్ఫామ్ చేసారు. సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి యూఎస్ లో కొంతమేర చిత్రీకరణ జరపాల్సి ఉంది. దీంతో కీర్తి సురేష్ యూఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై చేశారు. దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది.