'గుడ్ లక్ సఖి'  అంటున్న కీర్తిసురేష్

'గుడ్ లక్ సఖి'  అంటున్న కీర్తిసురేష్

సావిత్రి జీవిత కథ‌ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ మారిపోయింది. న‌టిగా 66వ జాతీయ పుర‌స్కారాల్లో ఉత్త‌మ న‌టి అవార్డుని ద‌క్కించుకుని మ‌రింత గుర్తింపుని, స్టార్ డ‌మ్ నీ సొంతం చేసుకుంది. ఆ త‌రువాత నుంచి వ‌రుస‌గా న‌ట‌న‌కు ప్రాధాన్య‌త వున్న చిత్రాల్ని మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌స్తోంది. కీర్తి సురేష్ న‌టించిన `పెంగ్విన్‌` ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంది. మ‌రో చిత్రం `మిస్ ఇండియా` రిలీజ్‌కు సిద్ధంగా వుంది.తెలుగులో నితిన్‌తో `రంగ్‌దే`, మ‌హేష్‌తో `స‌ర్కారు వారి పాట‌` చిత్రాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ న‌టిస్తున్న `అన్నాత్తే` లో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. కీర్తి తాజాగా 'గుడ్ లక్ సఖి' అనే సినిమాలోనూ నటించింది. విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి - జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు 'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.