మీ తల పుండు కడిగేది నేనే..ఆలోచించండి !

మీ తల పుండు కడిగేది నేనే..ఆలోచించండి !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఅర ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ సభలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్న నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఎంత మంది వస్తారని ప్రశ్నించిన ఆయన ఇది జాతీయ ఎన్నికల...మున్సిపల్ ఎన్నికలేనని ఎద్దేవా చేశారు. వరదలో మునిగాం ఆదుకోండి అంటే పైసా ఇవ్వలేదని ఇప్పుడు ఏమో ఓట్ల కోసం వరదలా వస్తున్నారని అన్నారు.

నేను ఢిల్లీ కి పోతున్నా అని అక్కడి వాళ్లకు వణుకు పుట్టిందన్న ఆయన అందుకే వీటిని ఇక్కడే అనగబట్టాలని అందరూ ఇక్కడికి వస్తున్నారని అన్నారు. యూపీ సీఎం కి అసలు టికాన లేదు... ఆయన నాకు నీళ్లు ఇస్తాడట యూపీ 25 ర్యాంకులో ఉంది..25వ ర్యాంకొడు వచ్చి ఐదో ర్యాంక్ వచ్చిన మనకు చెప్తాడని ఎద్దేవా చేశారు. టెంటు లేదు..ఫ్రంట్ పెడతారు అంటున్నారని ఫ్రంట్ పెడుతున్న అని ఎవడు చెప్పాడు ? అని ఆయన ప్రశ్నించారు. నేను ఏట్లోస్తామో... చూపెడతా అని అన్నారు. తెలంగాణ ఉద్యమం సాధనలో కూడా ఇలాంటి మాటలే అన్నారన్న ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినోడిది నెత్త ..కత్తా..? మాటలు చెప్పి పోతారు...తలపుండు కడిగేది నేనే ఆలోచించండి అని ఆయన పేర్కొన్నారు.