ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్..!

    ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్..!

ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ కు చేరుకొని కేసీఆర్ ఎక్కడ అంటూ ప్లకార్డు లు పట్టుకున్నారు. ప్రతిపక్షనేతలు సైతం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని...ఆయన ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. వెర్ ఈజ్ సీఎం అంటూ హై కోర్ట్ లో సైతం పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రెండువారాల తరవాత ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. అంతే కాకుండా ఒకటి రెండు రోజులో ఆయన రైతులతో సమావేశమయ్యేందుకు సిద్దమౌతున్నట్టు కూడా తెలుస్తోంది.