ప్రగతి భవన్ లో కరోనా కలకలం..5 గురు సిబ్బందికి పాజిటివ్.!

ప్రగతి భవన్ లో కరోనా కలకలం..5 గురు సిబ్బందికి పాజిటివ్.!

తెలంగాణాలో కరోనా వేగం పెంచింది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా ను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో మరీ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70నుండి 80శాతం వరకు హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. మరోవైపు సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. అందులో పనిచేసే ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రగతి భావం మొత్తం శానిటైజేషన్ చేపట్టారు. కాగా ముఖ్యమంత్రి గత నాలుగురోజుల నుండి గజ్వెల్ లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.