నాకు ఏం కాలేదు....క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌ మనవడు హిమాన్షు

నాకు ఏం కాలేదు....క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌ మనవడు హిమాన్షు

సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షుకు గాయాలు అయ్యాయని ఇవాళ పొద్దున నుంచి వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయిందని... దీంతో అతను బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరాడని వార్తలు వచ్చాయి. కనీసం నిలబడలేని పరిస్థితుల్లో హిమాన్షు ఉన్నట్టు సోషల్‌ మీడియాలో, కొన్ని వార్త పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే... ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు.  తనకు ఎలాంటి ఫ్యాక్చర్‌ కాలేదని...ప్రస్తుతం తాను బాగానే నడుస్తున్నానని తెలిపాడు. రేపటి నుంచి ఎప్పటి లాగే...మార్నింగ్‌ రన్నింగ్‌కు వెళతానని కూడా తెలిపాడు.  కొన్ని వార్త పత్రికలు తనపై అనవసర వార్తలు రాస్తున్నాయని...అలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని అయ్యాడు హిమాన్షు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాయడానికి ధైర్యం చేయవద్దని హిమాన్షు పేర్కొన్నాడు.