ఎవడి దమ్మెంతుందో తేల్చుకుందాము...కేసీఆర్ ఫైర్

ఎవడి దమ్మెంతుందో తేల్చుకుందాము...కేసీఆర్ ఫైర్


‘ఈ విపత్కర సమయంలో కొన్ని పత్రికలు దుర్మార్గంగా రాస్తున్నాయని కేసీఆర్ అన్నారు. అలాంటి చిల్లర గాళ్ళు రాసే రాతలు పట్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఔషధాల కొరత లేదన్న ఆయన మావద్ద 40వేల పీపీఈ కిట్లు ఉన్నాయని అన్నారు. అవి కాక 5 లక్షల కిట్లకు ఆర్డర్‌ పెట్టమని అన్నారు. లోకం ఆగమవుతుంటే చిల్లర వేషాలు వేయడం సరికాదని ఆయన అన్నారు. అనుచితంగా వ్యవహరిస్తే సరైన సమయంలో సరైన శిక్ష వేస్తాం. దుర్మార్గులను వదిలిపెట్టం. సంక్షోభ, క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాలి అని ఆయన అన్నారు. నేను మీడియాకు వ్యతిరేకం కాదన్న ఆయన రాజకీయాలకు బోలెడంత సమయం ఉందని అన్నారు. అసత్యాలు ప్రచారం చేసేవారిని వదిలిపెట్టమని అన్నారు. తప్పుడు వార్తలు రాసేవారికి కరోనావైరస్ సోకాలని శాపం పెడుతున్నాను. కుట్ర పూరితంగా, అవగాహనరాహిత్యంతో తప్పుడు వార్తలు రాసేవారికి శిక్షలు తప్పవు.. కేసీఆర్ చెబితే ఖతర్నాక్‌గా ఉంటుంది. అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.