జ్యూయెలరీ యాడ్ లో కత్రినా

జ్యూయెలరీ యాడ్ లో కత్రినా

'మల్లీశ్వరి'లో మహారాణిగా మెప్పించిన కత్రినా కైఫ్‌ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకుని షూటింగ్ లలో పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ తో సినిమాల షూటింగ్స్ అన్నీ బంద్ అయిన నేపథ్యంలో ఏ షూట్ అంటారా... ఓ వ్యాపారప్రకటనలో సందడి చేసింది కత్రినా కైఫ్‌. ఆ ప్రకటన కళ్యాణ్ జ్యూవెలర్స్ ది కావటం విశేషం. ఈ ప్రకటన తెలుగు వెర్షన్‌ లో అమితాబ్, నాగార్జున, జయాబచ్చన్, రెజీనా సందడి చేయగా... హిందీ వెర్షన్‌ లో అబితాబ్, జయాబచ్చన్, కత్రినాకైప్, రెజీనా కసండ్రా, నిధి అగర్వాల్, మంజు వారియర్, రెబా మోనికా జాన్ నటించారు. ఈ ప్రకటన కోసం కత్రినాకైప్, రెజీనా కసండ్రా, నిధి అగర్వాల్, మంజు వారియర్, రెబా మోనికా జాన్ సిస్టర్స్ గా నటించటం విశేషం. ఈ యాడ్ ఫోటోలను కత్రిన తన ఇన్ స్టా లో షేర్ చేశారు. సంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆభరణాలను ధరించి సందడి సందడి చేశారు. ఈ ఫోటోస్ కి అందమైన లేడీస్ తో అద్భుతమైన షూట్ అనే క్యాప్షన్ కూడా పెట్టింది కత్రినా. ప్రస్తుతం కత్రినా 'టైగర్ 3' తో పాటు మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తోంది.