కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న కత్రినా.. ఆ సినిమా కోసమే..

కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న కత్రినా.. ఆ సినిమా కోసమే..

బాలీవుడ్‌లో సినిమాల జోరు పెరిగింది. వరుసగా సినిమాలు ప్రారంభం అవుతున్నాయి. వాటిలో బాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అంతిమ్ సినిమాను పూర్తి చేసుకుంటున్న సల్మాన్ అప్పుడే తన తదుపరి సినిమాకు కూడా సన్నాహాలు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ తర్వాతి సినిమా టైగర్ 3. ఈ సినిమాలో యాక్షన్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం కత్రీనా కైఫ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారంట. సినిమాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్న కత్రీనా ఆ పాత్రకు కావలసిన శిక్షణను తీసుకుంటున్నారు. కిక్ బాక్సింగ్, హ్యండ్ టు హ్యాండ్ కాంబాట్‌లోని మెళకువలను నేర్చుకుంటున్నారంట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈనెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షేడ్యూల్‌లో కత్రినా భారీ స్టంట్స్ చేయనున్నారంట. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో సల్మాన్ అభిమానుల అంచనాలను ఏ మాత్రం అందుకుంటారో వేచి చూడాలి.