కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా.. : కత్తి కార్తీక

కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా.. : కత్తి కార్తీక

52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తానని రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకొని మోసం చేసారని బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక పై పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కత్తి కార్తీక స్పందించారు . ఎం ఎన్టీవీ తో మాట్లాడుతూ ... నామినేషన్ విత్ డ్రా చేయమని నా మీద ఒత్తిడి లు వస్తున్నాయి అన్నారు. " 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేస్తే ఎవరు ఊరుకోరు. ల్యాండ్ కి సంబంధించి అన్ని ఎం ఓ ఇ లు నా దగ్గర ఉన్నాయి. కోటి రూపాయలు చెక్కు రూపం లో ఇచ్చారు. కేసు ను న్యాయ పరం గా ఎదుర్కొంటా,.. ల్యాండ్ చూపించడం వరుకు మాత్రమే మా పని,అన్ని చట్ట పరం గానే జరిగాయి. కేసు గురించి నన్ను ఎవరు సంప్రదించలేదు, హైద్రాబాద్ లో నా ఆఫీస్ కి నిన్న సాయంత్రం పోలీసులు వచ్చారని తెలిసింది. నేనుదేనికిభయపడను‌,అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొంటా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజకీయాలను వీడను. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు 2023లో దుబ్బాక నుంచే పోటీ చేస్తాను " అని ఆమె చెప్పుకొచ్చారు.