అవతార్ 2 కోసం కేట్ విన్‌స్లెట్ ఫీట్...అమ్మో !

అవతార్ 2 కోసం కేట్ విన్‌స్లెట్ ఫీట్...అమ్మో !

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌గా మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో భాగం మొదటి భాగం కంటే అద్భుతంగా ఉంటుందట. ఈ రెండో భాగంలో పండోరా గ్రహాన్ని పూర్తిగా చూపెట్టబోతున్నారట. అలాగే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని సీన్లు ఉంటాయట. ఈ సినిమాలో కేట్ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టార్స్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కేట్ విన్‌స్లెట్ నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల 14 సెకెండ్ల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. ఫ్రీ-డైవ్ కూడా నేర్చుకుందట. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ సినిమా డిసెంబర్ 16, 2022న విడుదల కాబోతోంది.