బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కార్తీక్ ఆర్యన్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కార్తీక్ ఆర్యన్

బాలీవుడ్ లో రీలజ్ డేట్స్ అనౌన్స్ చేసే జాతర జరుగుతోంది. ప్రతీ రోజూ ఎవరో ఒక హీరో తమ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తున్నారు. వెంటనే సొషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. ఇప్పుడు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ వంతు వచ్చింది. 

‘భూల్ బులయ్య’... మన ‘చంద్రముఖి’ సినిమాకి హిందీ రీమేక్. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించాడు. విద్యా బాలన్ తన పర్ఫామెన్స్ తో అప్పట్లో అందర్నీ సర్ ప్రైజ్ చేసేసింది. అయితే, ఇప్పుడు ‘భూల్ బులయ్య’ సీక్వెల్ రాబోతోంది. ఒరిజినల్ స్టోరీతో హిందీలో రూపొందిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. టబు కీలక పాత్ర చేస్తోన్న ‘భూల్ బులయ్య 2’ కార్తిక్ ఆర్యన్ హీరోగా సిద్ధమవుతోంది. ఈ సినిమా కొత్త పిక్ ఒకటి షేర్ చేస్తూ, హీరో కార్తిక్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఆయన తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ‘నవంబర్ 19న వచ్చేస్తున్నాం’ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు...

కార్తిక్ ఆర్యన్ గత చిత్రం ‘లవ్ ఆజ్ కల్’. సారా అలీఖాన్ తో చేసిన ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే, కార్తిక్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘భూల్ బులయ్య 2’తో పాటూ ‘దోస్తానా 2’ సినిమాలో కూడా ఈ హ్యాండ్సమ్ కనిపించనున్నాడు. ‘భూల్ బులయ్య’లో కియారా జోడీ కట్టగా ‘దోస్తానా 2’లో కార్తిక్ తో జాన్వీ కపూర్ ఆడిపాడనుంది. మరోవైపు, ‘ధమాకా’ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో జర్నలిస్ట్‌ గా నటిస్తున్నాడు ఆర్యన్. సౌత్ కొరియన్ మూవీ ‘ద టెర్రర్ లైవ్’ కు ‘ధమాకా’ హిందీ రీమేక్. రామ్ మద్వానీ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ నెట్ ప్లిక్స్ లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి...