రణ్ వీర్, రోహిత్ బాటలో కార్తీక్ ఆర్యన్!

రణ్ వీర్, రోహిత్ బాటలో కార్తీక్ ఆర్యన్!

కరోనా కల్లోలం కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. కానీ, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ మాత్రం జోరుమీదున్నాడు. ఈ మధ్యే కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటంతో హోమ్ క్వారంటైన్ అయ్యాడు. అయితే, ఆరోగ్యం మాటెలా ఉన్న ఈ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో ఉత్సాహం మాత్రం తగ్గనీయటం లేదు. తాజాగా 3 కోట్లు విలువ చేసే ఓ కార్ కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు! నిజానికి గత మూడు సంవత్సరాలుగా కార్తిక్ ఏదో ఒక ఖరీదైన వ్యవహారంతో సినీ పరిశ్రమలోని వార్ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. మొదట తాను ఒకప్పుడు, బ్రేక్ రాక మునపు... అద్దెకున్న అపార్ట్మెంట్ కొనేశాడు. తరువాతి సంవత్సరం కార్తిక్ వాళ్ల అమ్మ కోసం 'మిని కూపర్' కార్ కొన్నాడు. ఆ లగ్జరీ వెహికల్ తరువాత ఇప్పుడు లాంబోర్గిని కంపెనీ వారి స్పోర్ట్స్ ఎస్ యూవీ స్వంతం చేసుకున్నాడు. తన బ్రాండ్ న్యూ బ్లాక్ కార్ కోసం ఏకంగా 3 కోట్లు చెల్లించాడట. కార్తిక్ ఆర్యన్ కంటే ముందే ప్రఖ్యాత ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్... లాంబోర్గిని నుంచీ కోట్లు విలువ చేసే కార్లు కొన్నారు రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి. అప్పట్లో వారు ఖరీదు చేసిన ఎల్లో అండ్ రెడ్ లగ్జరీ ఎస్ యూవీస్ పెద్ద చర్చకు దారి తీశాయి. ఇప్పుడు కార్తిక్ కూడా రణవీర్, రోహిత్ శెట్టి సరసన ప్రౌడ్ లాంబోర్గిని ఓనర్ అయ్యాడు కార్తిక్ ఆర్యన్!