నాని సినిమాతో పాటు కార్తీ సినిమా కూడా...

నాని సినిమాతో పాటు కార్తీ సినిమా కూడా...

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా గతేడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. అయితే నాని సినిమాతో పాటుగా హీరో కార్తీ 'ఖైదీ' సినిమా కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా తెలిపారు.  బిడ్డను చూడాలనే ఆశతో జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ జీవితం లో జరిగే ఒక్క రాత్రిలో సంఘటనలతో ఈ సినిమా రూపొందింది. గత ఏడాది దీపావళి సందర్బంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకొని హీరో కార్తీని ప్లాప్ ల నుండి బయటపడేసింది. అయితే ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.