మంత్రి తండ్రి, భార్య‌, కూతురుకు క‌రోనా..

మంత్రి తండ్రి, భార్య‌, కూతురుకు క‌రోనా..

క‌రోనా వైర‌స్ రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది...  ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు క‌రోనా... సాధార‌ణ వ్య‌క్తుల నుంచి వీవీఐపీల వ‌ర‌కు ఈ మాయ‌దారి వైర‌స్ బారిన ప‌డుతున్నారు.. తాజాగా.. కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి సుధాకర్ కుటుంబం క‌రోనా బారిన ప‌డింది.. మొద‌ట సుధాక‌ర్ తండ్రి దగ్గు, జ్వరంతో బాధ‌ప‌డ‌డంతో.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. అనుమానంతో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది.. ఇదే స‌మ‌యంలో.. మంత్రి, ఆయ‌న‌ భార్య, కుమార్తె, కుమారుడికి కూడా క‌రోనా టెస్ట్‌లు చేశారు.. వీరిలో భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా తేలింది... మంత్రి సుధాకర్ తోపాటు ఆయ‌న కుమారుడికి నెగిటివ్‌గా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు మంత్రి సుధాక‌ర్‌.