కోడి కూరే కొంపముంచింది..! భార్యను చంపేశాడు..

కోడి కూరే కొంపముంచింది..! భార్యను చంపేశాడు..

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు, అలకలు మామూలే.. కొందరైతే ఎప్పుడు తిట్టుకుంటారో.. ఎప్పుడు కొట్టుకుంటారో.. ఎప్పుడు ఒక్కటవుతారో కూడా తెలియదు.. అయితే, కోడి కూర ఓ గర్భవతి ప్రాణాలు తీసింది.. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర ప్రైవేట్ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మధుర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... వీరికి ఇప్పటికే 11 నెల బాలుడు ఉండగా.. ప్రస్తుతం ఆమె గర్భవతి.. అయితే, లాక్‌డౌన్‌కు ముందు మధుర సమీపంలోని బాగేపల్లి తాలూకా హొసహుడ్యలోని పుట్టింటికి వెళ్లిన మధుర.. లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుంది.. బాలచంద్ర కూడా వెళ్లడానికి లేకుండా పోయింది.. మొత్తానికి రెండు రోజుల క్రితం భార్య దగ్గకు వచ్చాడు. అక్కడే భార్యతో గొడవపడి గొంతు నులిమి చంపేశాడు. 

అత్తగారింటికి వచ్చిన బాలచంద్రకు మంచి మర్యాదలే జరిగాయి.. పీకలదాక మద్యం సేవించాడు.. భార్యకు చికెన్ కర్రీ వండమని చెప్పాడు.. ఆమె కోడికూర వండి భర్తకు వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర కూరలో ఉప్పు తక్కువైందని గొడవ పెట్టుకున్నాడు.. అప్పటికి ఆ గొడవ ముగిసింది అనుకున్నా.. రాత్రి గదిలో మరోసారి ఇదే విషయమై గొడవపడి.. ఆవేశంలో మధుర గొంతు నులిమి చంపేశాడు. అయితే, ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారిని నమ్మించే ప్రయత్నం చేశారు.. విషయం చేళూరు పోలీసులకు తెలియడంతో.. బాలచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.