హోంశాఖ మంత్రికి కరోనా... 

హోంశాఖ మంత్రికి కరోనా... 

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది.  కరోనా కేసులతో పాటుగా రికవరీ రేటు పైగా పెరుగుతుండటం విశేషం.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు.  అటు కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.  దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి.  కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అనేక మంది నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  తాజగా కర్ణాటక హోంశాఖ మంత్రి బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది.  ఇటీవలే అయన కరోనా టెస్టులు చేయించుకున్నారు.  ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది.  అయితే, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.