హోంమంత్రికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లోనే..!

హోంమంత్రికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లోనే..!

కరోనా వైరస్ ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, పలు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు అనే తేడాలేకుండా కరోనా బారినపడ్డారు.. తాజాగా, కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి బసవరాజ్ బొమ్మై.. ఇక, నాతో కొన్ని రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 82,066 మంది మృతిచెందారు. ఇక, కర్ణాటకలో ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు.. సీఎం కూడా కరోనాబారనపడి కోలుకున్నసంగతి తెలిసిందే. కర్ణాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య  3,69,229గా ఉండగా.. ఇప్పటి వరకు 7,481 మంది మృతిచెందారు.