కేజీఎఫ్2 టీజర్.. షాక్ ఇచ్చిన కర్ణాటక ఆరోగ్య శాఖ..

కేజీఎఫ్2 టీజర్.. షాక్ ఇచ్చిన కర్ణాటక ఆరోగ్య శాఖ..

కేజీఎఫ్2 ఎంతటి క్రేజ్ ఉన్న సినిమానో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఈ సినిమా టీజర్ ఇటీవల హీరో యష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన 24గంటల్లోనే దాదాపు ఐదు మిలియన్ల వ్యూస్ తెచ్చుకొని రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమాకు ఊహించని అడ్డంకి ఎదురైంది. ఈ సినిమా నుంచి కొన్ని సన్నవేశాలు తొలగించాల్సిందిగా కర్ణాటక ఆరోగ్య శాఖ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో యష్ పోగ త్రాగే సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. అంతేకాకుండా దీనికి సంబంధించి హీరో యష్‌కు చిత్ర యూనిట్‌కి నోటీసులను జారీ చేసింది. టొబాకో 2003చట్టంలోని సెక్షన్5 నిబంధనల ప్రకారం పోగ త్రాగే సన్నవేశాలు ఉండకూదని, వాటిని తొలగించకపోతే ఈ చట్టాన్ని అతిక్రమించనట్లేనని తెలిపింది. ఇటువంటి సన్నవేశాలన కారణంగా యువత చెడు దారిపట్టే అవకాశాలు ఉన్నాయని, అందుకనే ఈ సినిమా నుంచి అన్ని పొగ త్రాగే సీన్‌లను తొలగించాలని తెలపింది. పొగ త్రాగడం కారణంగా క్యాన్సర్, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు వస్తాయని, సినిమాల్లో హీరోలు పొగ తాగడం చూసి యువత కూడా వారి అడుగుల్లో నడిచి పొగ త్రాగుతారని దాంతో దేశంలోని యువత అనారోగ్యం పాలవుతుందని చెప్పారు. అందుచేత కేజీఎఫ్2 సినిమా నుంచి పొగ త్రాగే సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. వాటిని తొలగించకపోతే సినిమాపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.