లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో మొదటి దేవాలయాలు ఇక్కడే తెరుచుకోనున్నాయి

లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో మొదటి దేవాలయాలు ఇక్కడే తెరుచుకోనున్నాయి

కరోనా లాక్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థనే కూదు దేశంలో ఉన్న మత సంస్థలపై కూడా పడింది...దేశంలో ఉన్న అన్ని ధార్మిక క్షేత్రాలు మూతపడ్డాయి..క్రమంగా  చాలా రంగాలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన దేవాలయాలకు మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.మే 31తో లాక్‌డౌన్‌ ముగుస్తుండడంతో లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తోంది....కర్ణాటకలో జూన్‌ 1వ తేదీ నుంచి అన్ని మతలా ధార్మిక క్షేత్రాలు తెరుస్తున్నట్లు కర్నాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు...నిర్థిష్ట మార్గదర్శకాలను అనుసరించి ఆలయాల్లోకి భక్తులకు అనుమతిస్తామన్నారు...

కరోనా కారణంగా దేవాలయాల్లోకి భక్తులను రెండు నెలలకు పైగా అనుమతించని విషయం తెలిసిందే... ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది...అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు...అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు... అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు.