కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ నేత... 

కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ నేత... 

కర్ణాటకలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది కరోనా బారిన పడ్డారు.  కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డియూరప్ప కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.  ఆగష్టు 3 వ తేదీన అయన కరోనా బారిన పడ్డారు.  దీంతో అయనకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే.  గురువారం రోజున ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఈ టెస్టుల్లో నెగెటివ్ గా రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.