కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు కరోనా 

కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు కరోనా 

కర్ణాటకలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్ అని తేలింది.  ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది.  సిద్దరామయ్య ప్రస్తుతం మణిపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  

గత నెలరోజులుగా ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.  ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో బెంగళూరులోని మణిపూర్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు.  ఈ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.  దీంతో ఆయనకు యూరినరీ ఇన్ఫెక్షన్ కు సంబందించిన చికిత్సతో పాటుగా కరోనా చికిత్స కూడా అందిస్తున్నారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు ఇద్దరికీ కరోనా సోకడంతో అధికారులు  అప్రమత్తం అయ్యారు.