కరోనా నుండి కోలుకున్న కరణం బలరాం..

కరోనా నుండి కోలుకున్న కరణం బలరాం..

కరోనా నుండి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కోలుకున్నారు. నిన్న హైదరాబాద్ లో ఆయన చికిత్స పొందుతున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ 19 భారిన పడటంతో గత 10 రోజుల క్రితం హాస్పిటల్లో కరణం బలరాం చేరారు. ఆయన కంటే ముందే ఆయన కుమారుడు వెంకటేష్ కూడా పాజిటివ్ రావటంతో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. కానీ కరణంకు సీరియస్ కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక తాజాగా చేసిన పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చిందని వైద్యుల నిర్ధారించారు. అయితే వయసు రీత్యా కొన్నిరోజుల పాటు హైదరాబాద్ లోని తన ఇంట్లోనే హోం క్వారంటైన్ కే పరిమితం కానున్న కరణం.