తన ఆరోగ్యంపై కపిల్ దేవ్ ట్వీట్..

తన ఆరోగ్యంపై కపిల్ దేవ్ ట్వీట్..

భార‌త క్రికెట్ లెజెండ్... టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో బాధపడుతూ నిన్న ఆస్ప‌త్రిలో చేరారు.. నిన్న ఉద‌యం గుండెపోటు రావ‌డంతో.. వెంట‌నే ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. 61 ఏళ్ల లెజెండరీ క్రికెటర్‌ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై స్వయంగా కపిల్ దేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని పేర్కొన్నాడు కపిల్ దేవ్. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా కపిల్ ఆరోగ్య పరిస్థితిపై అభినానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని అందరు ఆకాంశించారు.