క‌పిల్ దేవ్‌కు గుండెపోటు

క‌పిల్ దేవ్‌కు గుండెపోటు

భార‌త క్రికెట్ లెజెండ్... టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో బాధపడుతూ ఆస్ప‌త్రిలో చేరారు.. ఇవాళ ఉద‌యం గుండెపోటు రావ‌డంతో.. వెంట‌నే ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. 61 ఏళ్ల లెజెండరీ క్రికెటర్‌ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.. ఇప్పుడు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. అయితే, కపిల్ దేవ్ ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.. ఎందుకంటే క‌పిల్ కుటుంబ సభ్యులు.. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఇంకా స్పందించ‌లేదు.. కాగా, 1983 లో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశానికి తొలి ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన ఘ‌న‌త క‌పిల్‌కే ద‌క్కింది.. లార్డ్స్‌లో జ‌రిగిన ఫైన‌ల్‌లో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి.. భార‌త్‌ను ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా నిలిపారు క‌పిల్ దేవ్.