'ఆదిపురుష్'లో కన్నడ సూపర్ స్టార్ సుదీప్

'ఆదిపురుష్'లో కన్నడ సూపర్ స్టార్ సుదీప్

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' లో నటిస్తున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపిక అయ్యారు. 

లంకాధిపతి రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చా సుదీప్ కనిపిస్తాడట. సుదీప్ గతంలో 'బాహుబలి'లోనూ గెస్ట్ రోల్ లో కనిపించాడు. 3డీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిజానికి 'ఆదిపురుష్'ను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అదే డేట్ కి కట్టుబడి ఉంటారా? లేక రిలీజ్ డేట్ మారుతుందా? అన్నది తేలాల్సి ఉంది.