అనుష్క-గవాస్కర్ మధ్యలో కంగనా...

అనుష్క-గవాస్కర్ మధ్యలో కంగనా...

ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు కీలకమైన క్యాచ్ లను వదిలేయడంతో పాటు బ్యాటింగ్ లోను విఫలం అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్ కు కామెంట్రీ చేస్తున్న భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ విరాట్ భార్య అనుష్క శర్మ పేరు ప్రస్తావిస్తూ కామెంట్రీ చేసాడు.  అయితే గవాస్కర్ చేసిన వ్యాఖ్యల పై విరాట్ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదిక మిస్టర్ గవాస్కర్ మీ కామెంట్ చాలా అసహ్యకరమైనది అంటూ తెలిపింది. భర్త ఆటకు సంబంధించి భార్య పేరును ఎందుకు ప్రస్తావించారు. నన్ను ఎప్పుడు క్రికెట్‌లోకి లాగడం మానేస్తారో, అప్పుడు నేను ఈ స్టేట్‌మెంట్‌ లను ఇవ్వడం మానేస్తాను అని తెలిపింది. అయితే అనుష్క వ్యాఖ్యలకు సమాధాం ఇచ్చిన గవాస్కర్.. నేను అసహ్యకరమై కామెంట్ ఏం చేశాను. లాక్ డౌన్ లో కోహ్లీ అనుష్క బౌలింగ్ ఎదుర్కున్నాడు అని చెప్పను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు అని అన్నాడు. ఇక తాజాగా అనుష్క-గవాస్కర్ మధ్యలోకి కంగనా రనౌత్ వచ్చింది. తన ట్విట్టర్ వేదికగా ''గవాస్కర్ కామెంట్రీ సమయంలో అనుష్క పేరు ప్రస్తావించడం తప్పు అని చెప్తూనే ఇంతకముందు నన్ను అందరూ చట్టం పై గౌరవం లేని అమ్మాయి అన్నపుడు అనుష్క స్పందించలేదు'' అంటూ పోస్ట్ చేసింది.