కంగనా లిప్‌లాక్‌... ఫొటో వైరల్

కంగనా లిప్‌లాక్‌... ఫొటో వైరల్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. కంగన మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ విషయం సంచలనంగా మారింది. శివసేన నేతలకు దీటుగా కంగనా సైతం కామెంట్లు చేసింది. తాజాగా కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసుతో పాటు పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇప్పటికే చాలా మందిని టార్గెట్ చేసిన కంగనా మొన్నటిమొన్న ఏకంగా అమెరికా అధ్యక్షుడి పైన సంచలన కామెంట్లు చేసింది. జో బైడెన్ ను  ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ అని చెప్పుకొచ్చింది. ఆయనకు ఇంజెక్ట్ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి బైడెన్ ఉండరని సంచలన కామెంట్ చేసింది. ఇలా ఎప్పుడు వార్తల్లోకి వస్తోంది కంగనా. అయితే.. కంగనా ప్రస్తుతం సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. ఈ బిజీ షెడ్యూల్‌ వల్ల తన మేనల్లుడు పృథ్వీరాజ్‌ను చాలా మిస్‌ అవుతున్నట్టుగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. మేనల్లుడికి ముద్దిస్తున్న ఫోటోని షేర్‌ చేసిన కంగనా.. షూట్‌ కోసం బయలు దేరినప్పుడు అతను వెళ్లవద్దని అన్నాడని.. తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సి వస్తే రెండు నిమిషాలు నాతో కూర్చోని వెళ్లు అని చెప్పాడని తెలిపింది. ఇప్పటికీ అతని ముఖం గుర్తొస్తే.. తనకు కంట కన్నీరు కారుతుందని భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టింది కంగనా.