కోర్టుకెక్కిన కంగనా ... రెండు కోట్లు డిమాండ్

కోర్టుకెక్కిన కంగనా ... రెండు కోట్లు డిమాండ్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వర్సెస్ మహా సర్కార్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంగనాకు సంబంధించిన ముంబైలోని ఆఫీస్ ను అక్రమ కట్టడం కింద అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఇక శివసేన వర్సెస్ కంగనా ఎపిసోడ్స్ లో భాగంగానే ఇదంతా జరిగిందని అభిమానులు, ఆమె అనుచరులు నమ్ముతున్నారు. దాంతో ఆమె మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది కంగనా. వీడియోలో "నా ఆఫీస్ కూలినట్టే మీ గర్వం కూడా ధ్వంసం అవుతుంది " అంటూ కంగనా ఘాటు కామెంట్లు చేసింది. అనంతరం  మహా గవర్నర్ తో భేటీ అయ్యింది . ఆ  తరవాత కంగన వరుస ట్వీట్ లతో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిలో ఆమె నిరసనకారులను `ఉగ్రవాదులు` అంటూ అభివర్ణించింది. దాంతో ఆమెపై ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ మరియు 504 కింద కేసు నమోదైంది. ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగనా వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.  కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా కంగనా పై మండిపడుతున్నారు. అటు ముంబైలో కంగన కార్యాలయం కూల్చివేతకు కారణమైన మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన వ్యతిరేకంగా వెళుతోంది. ప్రస్తుతం ఆ కూల్చివేత వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది.  తన  పిల్ హిల్స్  హోమ్ ను కూల్చివేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2 కొట్ల రూపాయలను పరిహారం ఇవ్వాలని ఆమె కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వం పై అనిచిత వ్యాఖ్యలు చేసింది. ముంబైను పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్ గా  కంగనా అభివర్ణించిన విషయం తెలిసిందే .