రాష్ట్రపతిని మెప్పించిన కంగనా..!!
కంగనా రనౌత్ హీరోయిన్ గా చేసిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. విమర్శకుల మెప్పును పొందిన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్ నుంచి ట్రైలర్ అన్ని భిన్నంగా ఉండంతో సినిమాకు క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ తరువాత హీరోయిన్ కంగనా, హీరో రాజ్ కుమార్ రావు, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడికి మంచి పేరు వచ్చింది.
సినిమా బాగుందనే టాక్ రావడంతో సినిమా వాళ్లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా క్యూరియాసిటీ కలగడం షరా మాములే. రాష్ట్రపతికి కూడా ఈ సినిమా చూడాలని అనిపించిందట. రాష్ట్రపతి భవన్లో స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ సినిమాను రాష్ట్రపతి దంపతులతో పాటు, పలువురు మంత్రులు, రాష్ట్రపతి భవన్ ఉద్యోగులు వీక్షించారు. జడ్జిమెంటల్ హై క్యా సినిమా యూనిట్ ను రాష్ట్రపతి ప్రశంసించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)