కంగనాకి... అక్షయ్ 'సీక్రెట్' కాల్!?

కంగనాకి... అక్షయ్ 'సీక్రెట్' కాల్!?

ట్విట్టర్ లో రోజుకో బాంబు పేల్చే కంగనా రనౌత్ మళ్లీ హాట్ కామెంట్స్ చేసింది. ఎప్పటిలాగే బాలీవుడ్ మాఫియాని టార్గెట్ చేసిన ఆమె ఈ సారి చర్చలోకి ఖిలాడీ అక్షయ్ కుమార్ ని లాగింది. ఆయన లాంటి టాప్ స్టార్స్ చాలా మంది తనకి సీక్రెట్ గా ఫోన్ చేసి మెచ్చుకుంటారట. రీసెంట్ గా కంగనా నటించిన 'తలైవి' ట్రైలర్ విడుదలైంది. దానికి ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరి నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాలీవుడ్ పెద్దలు మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉండిపోయారు. ఆ క్రమంలోనే కంగనా తనకొచ్చే సీక్రెట్ కాల్స్ గురించి చెప్పింది. ఇండస్ట్రీలోని చాలా మంది తనకు రహస్యంగా అభినందనలు తెలుపుతుంటారని అంటోంది. కానీ, దీపిక, ఆలియా భట్ లాంటి వారి సినిమాలకు వచ్చినట్టు తన చిత్రాలకి పబ్లిగ్గా పొగడ్తలు రావని కుండబద్ధలు కొట్టింది. 

అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ కూడా బాలీవుడ్ మూవీ మాఫియాకు భయపడే అందరి ముందు కంగనా సినిమాని మెచ్చుకోలేకపోతే... ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇంతకీ, 'తలైవి' ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంతోగానీ ముంబై గ్లామర్ ప్రపంచంలో ముఠా రాజకీయాలు, బెదిరింపులు, లొంగదీసుకోడాలు... ఇవన్నీ మామూలే! గతంలో ఎవరూ పెద్దగా మాట్లాడే వారు కాదు. కంగనా మాత్రం నిత్యం నెపోటిజమ్ గ్యాంగ్ ని ఏకి పారేస్తోంది! చూడాలి మరి, అక్షయ్ కుమార్ తన గురించి కంగనా చెప్పిన మ్యాటర్ పై ఎలా స్పందిస్తాడో!