నా సిస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు : కంగనా

నా సిస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు : కంగనా

బాలీవుడ్ నటి కంగనారనౌత్ సోదరి రంగోలి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరైనా కంగనా జోలికి వస్తే ఆమె సోదరి రంగోలి చీల్చి చెండాడుతుంది. కంగనారనౌత్ వివాదల లిస్ట్ లో హృతిక్ రోషన్ నుంచి సోనమ్ కపూర్ వరకు చాల మంది ఉన్నారు. హృతిక్ తనకు అభ్యంతరకరమైన ఇమెయిల్స్ పంపించాడని కోర్టు వరకు వెళ్లిన కంగనా ఖాతాలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే  కంగనా సోదరి ట్విట్టర్ అకౌంట్ ను ఇటీవల అధికారులు తొలగించారు. అభ్యంతర పోస్ట్ లు పెడుతున్న కారణంగా ఆమె అకౌంట్ ను ట్విట్టర్ అధికారుల్లో తొలగించారు. అయితే రంగోలికి సపోర్ట్ గా కంగనా రంగంలోకి దిగింది. తన సోదరి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో మాట్లాడే హక్కు గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చింది. అయితే నా సిస్టర్ రంగోలి ఎలాంటి ముస్లింల మారణహోమాన్ని ప్రోత్సహించలేదని వాపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.