అందరి ముందు గట్టిగా కౌగిలించుకునేవాడు - కంగనా

అందరి ముందు గట్టిగా కౌగిలించుకునేవాడు - కంగనా

బాలీవుడ్లో వేధింపులు ఎదుర్కున్న హీరోయిన్లు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.  ఇప్పటికే తను శ్రీ దత్తా నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడని సంచలనం రేపగా స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకుడు వికాస్ బల్ 'క్వీన్' సినిమా చిత్రీకరణ సమయంలో తనను చాలా వేధించాడని చెప్పుకొచ్చింది.  

ఎప్పుడు కలిసినా అతను నన్ను అందరి ముందు గట్టిగా కౌగిలించుకుని, నా జుట్టు వాసన చూస్తూ, తన ముఖాన్ని మెడపై రుద్దేవాడు.  నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని.  ఏదో రకంగా కష్టపడి అతడి నుండి తప్పించుకునేదాన్ని.  అతడికున్న శృంగారపు అలవాట్ల గురించి చెప్పేవాడు.  ప్రతిరోజూ పార్టీల్లో మునిగి తేలేవాడు అంటూ సంచలన విషయాల్ని బయటపెట్టింది.  దీంతో హిందీ పరిశ్రమలో ఇంకో కొత్త వివాదం తెరపైకొచ్చినట్టైంది.  ముందు ముందు ఇలా వేధింపులకు గురైన హీరోయిన్లు ఇంకెంత మంది బయటికి వస్తారో మరి.