'నేను ఎంపీగా ఉండగానే ఏపీకి రైల్వే జోన్'

'నేను ఎంపీగా ఉండగానే ఏపీకి రైల్వే జోన్'

తాను ఎంపీగా ఉండగానే విశాఖకు రైల్వే జోన్‌ వస్తుందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఇవాళ విశాఖలో ఆయన మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన విశాఖలో మోడీ సభ తర్వాత బీజేపీ విధానాలపై ప్రజల అపోహలు తొలగుతాయన్నారు. ఏయూ గ్రౌండ్‌లో సభ నిర్వహించాలనుకున్నామని.. కానీ యూనివర్సిటీకి నిబంధనలున్నాయంటూ అనుమతి నిరాకరించారని చెప్పారు. అందుకే.. సభను రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించబోతున్నామన్నారు హరిబాబు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడానికి ఏయూకు నిబంధనలు గుర్తుకురావని.. మోడీ సభకు మాత్రం గుర్తొస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి తాను పోటీ చేయడంపై పార్టీ అధినాయకత్వమే నిర్ణయించాలన్న హరిబాబు.. పొత్తులు ఉంటే విజయానికి అనుకూలమా? విడిగా పోటీ చేస్తేనే మేలా? అన్నది హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు.