స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన కమల్

స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన కమల్

విశ్వనటుడు కమల్ హాసన్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు . అద్భుతమైన సినిమాల్లో నటించిన కమల్ రాజకీయాల్లోకూడా రాణించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కమల్ బరిలోకి దిగుతున్నాడు. దీనితో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే తిరిగి ప్రారంభం అవ్వనుంది. ఈ సినిమాలో 90 ఏళ్ల వృద్దుడిగా, యువకుడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు కమల్. అలాగే తమిళ్ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా కమల్ స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ లో టోపీతో  కమల్ లుక్ అదిరిందనే చెప్పాలి. కోర మీసంతో గుబురు గడ్డంతో కమల్ లుక్ ఆకట్టుకుంటుంది.