కరోనా ఎఫెక్ట్ : తన ఇంటిని హాస్పిటల్ గా మార్చిన కమల్

కరోనా ఎఫెక్ట్ : తన ఇంటిని హాస్పిటల్ గా మార్చిన కమల్

కమల్ హాసన్ గురించి మన అందరికి తెలుసు. అయితే ఆయన ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. అయితే అందులో జరిగిన క్రేన్ ప్రమాదం తరువాత ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ తరువాత కమల్ ప్రమాదానికి సంబంధించిన విషయం లో పోలీసుసులు తనను బాగా వేధిస్తున్నారని కోర్టు లో పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా అని సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే మన దేశం లో ఈ కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 649 నమోదయ్యాయి. అలాగే 9 మరణాలు సంభవించాయి. అయితే ఈ వైరస్ తో పోరాడటానికి కమల్ తన ఇంటిని హాస్పిటల్ గా మారుస్తానని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే దానికి ప్రభుత్వం అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ ట్విట్ చేసాడు. అయితే కమల్ తీసుకున్న ఈ నిర్ణయం పైన అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి కొందరు సినీ ప్రముఖులు ముందుకు రావాలని అంటున్నారు.